Saturday 27 September 2014

అక్రమ ఆస్తుల కేసులో జయలలితకు నాలుగేళ్ళ జైలు

                                             
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను దోషిగా నిర్ధారించిన బెంగళూరు ప్రత్యేక కోర్టు శనివారం ఐదు గంటల ప్రాంతంలో జయలలితకు నాలుగేళ్ళ జైలు శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో జయలలిత తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో మొదట ముఖ్యమంత్రి జయలలితకు ఏడేళ్ళ జైలు శిక్ష పడుతుందని అనుకున్నారు. అయితే ప్రత్యేక కోర్టు ఆ శిక్షను నాలుగేళ్ళకు పరిమితం చేసింది. జయలలితకు నాలుగేళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పగానే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.జయలలితను కోర్టు నుంచే జైలుకు తరలించే అవకాశం వుంది.

No comments:

Post a Comment