
న్యూయార్క్‌లో ఉగ్రవాదులు విమాన దాడులు చేసి కూలగొట్టిన ట్విన్ టవర్స్ మృతులకు ప్రస్తుతం అమెరికాలో పర్యటనలో వున్న భారత ప్రధాని నరేంద్రమోడీ నివాళులు అర్పించారు. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ట్విట్ టవర్స్ కూలిపోయిన ప్రదేశంలో నిర్మించిన ‘గ్రౌండ్ జీరో’ దగ్గరకు వెళ్ళిన ఆయన అక్కడ వున్న స్మారక చిహ్నం మీద గులాబీ పువ్వును వుంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అమెరికా అధికారులు గ్రౌండ్ జీరోకి సంబంధించిన వివరాలను మోడీకి వివరించారు.
No comments:
Post a Comment