Monday, 29 September 2014

'గోవిందుడు..'పై ఓవర్ కాన్ఫిడెన్సా..!

                            
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'గోవిందుడు అందరివాడేలే' అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాపై మెగా అభిమానులలో అంచనాలు భారీగా వున్నాయి. 'గోవిందుడు అందరివాడేలే' సినిమా పై భరోసానో లేక మెగా అభిమానులపై నమ్మకమో కానీ ఈ సినిమాని నైజాం మరియు కృష్ణాలో నిర్మాత బండ్ల గణేష్ ఓన్ గా రిలీజ్ చేస్తున్నారట. మామాలుగా సినిమా నిర్మాణమే తలనొప్పిగా మారిన ఈ రోజుల్లో, అదే సినిమాని సొంతంగా రిలీజ్ చేయడమంటే కత్తి మీద సాము లాంటిది. మరీ ఇలాంటి సమయంలో బండ్ల గణేష్ గోవిందుడుని సొంతంగా ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? మెగా ఫ్యామిలీకి కంచుకోటగా వుండే నైజాం లో ఈ సినిమా అనుకున్న రేటు దక్కేలేదా? లేక ఈ సినిమాపై అంత ధీమాగా వున్నారా? ఏది ఏమైనా ఈ సినిమాపై బండ్ల గణేష్ కి వున్నాది కాన్ఫిడెన్స్ లేక ఓవర్ కాన్ఫిడెన్సా అనేది తెలియాలంటే అక్టోబర్ 1 వరకు ఆగాల్సిందే.

No comments:

Post a Comment