Monday, 29 September 2014

మాడిసన్ స్క్వేర్‌లో హర హర హర మోడీ నామజపం...

                            

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూయార్క్‌లోని మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌ వద్ద నిర్వహించిన ప్రవాస భారతీయ సభ విజయవంతమైంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సెలబ్రిటీల షోస్‌కు, సభలకు వేదిక! అలాంటి చోట భారత ప్రధానమంత్రి హోదాలో ఒక రాజకీయ నేతగా నరేంద్ర మోడీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో సుమారు దాదాపు 20 వేల మంది ఎన్నారైలతో పాటు.. అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభ సభ్యులు కూడా పాల్గొన్నారు. మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో మోడీ సభకు అవుతున్న ఖర్చు.. 15 లక్షల డాలర్లు. అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు. అమెరికాలోని ప్రవాస భారతీయులు, భారతీయ-అమెరికన్ల నుంచి ఈ మొత్తాన్ని విరాళాలుగా వసూలు చేసి సభను నిర్వహించారు. న్యూయార్క్‌ వీధుల్లో భారతీయం ప్రతిధ్వనించింది. భారత్‌మాతాకీ జై, మోడీ జిందాబాద్‌, హర హర మోడీ వంటి నినాదాలతో మాడిసన్‌ స్క్వేర్‌ మార్మోగిపోయింది. 

No comments:

Post a Comment